మదరాసీ.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌

మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ద్విభాషా చిత్రం ‘మదరాసీ’ పాన్ ఇండియా మూవీగా అదే పేరుతో తెలుగులో సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతోంది. కనుక మదరాసీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రేపు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్ జరుగబోతోంది. ఈ ఈవెంట్‌కు హాజరవ్వాలనుకునే వారు పాసుల కోసం http://shreyas.media/m  వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. 

ఈ సినిమాలో విద్యుత్ జమ్మవల్, బిజూ మీనన్, విక్రాంత్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌.శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఏఆర్. మురుగదాస్; సంగీతం: అనిరుద్ రవిచంద్రన్: కెమెరా: సుదీప్ ఎలామన్ చేస్తున్నారు. 

తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతోంది.