సంక్రాంతికి వస్తున్న మన శివశంకర వరప్రసాద్... రాజాసాబ్!

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ గ్రాఫిక్స్ ఇతర కారణాల వలన ఆలస్యమవుతూ చివరికి 2026, జనవరి 9న విడుదల కాబోతోంది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చేస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ కూడా పండగకి వస్తున్నారని ముందే చెప్పేశారు. ఈ సినిమాకి గ్రాఫిక్ సమస్యలు లేవు. కనుక చెప్పిన టైమ్‌కి వచ్చేయడం ఖాయమే. మొదట జనవరి 13న అనుకున్నప్పటికీ ఆరోజు మంచి రోజు కాదని 14న విడుదల చేస్తున్నారు.

 అంటే కేవలం 5 రోజుల వ్యవధిలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయన్న మాట. ఈలోగా కోలీవుడ్‌ హీరోలలో ఎవరో ఒకరు ఓ సినిమాతో సంక్రాంతి బరిలో దిగవచ్చు. 

సంక్రాంతికి ప్రభాస్-చిరంజీవి తలపడబోతున్నారు కనుక ఇద్దరి సినిమాలలో ఏది నిలబడుతుంది? లేదా రెండూ వేర్వేరు జోనర్లలో వస్తున్నందున రెండూ నిలబడతాయా?వీటికి పోటీగా మరేవైనా సినిమాలు బరిలో దిగుతాయా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.