లిటిల్ హార్ట్స్ ట్రైలర్‌ రేపే

సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం జంటగా చేస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ టీజర్‌ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. సెప్టెంబర్‌ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కనుక రేపు (శనివారం) ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారు. 

మద్య తరగతి కుటుంబాలకు చెందిన ఇంటర్-డిగ్రీ విద్యార్ధుల చదువులు, కాలేజీలలో ప్రేమలు, గొడవలే ఈ లిటిల్ హార్ట్స్. బహుశః శేఖర్ కమ్ముల సూపర్ హిట్ మూవీ ‘హ్యాపీ డేస్’ స్పూర్తితో దీనిని తీస్తున్నట్లున్నారు. 

ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య కృష్ణ, ఎస్ఎస్ కంచి, అనితా చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

 ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాయి మార్తాండ్ , సంగీతం: సంజిత్ ఎర్రమిల్లి, కెమెరా: సురియా బాలాజీ, ఎడిటింగ్: శ్రీధర్ సొంపల్లి చేస్తున్నారు. 

బన్నీ వాసు, వంశీ నందిపాటి ఎంటర్టెయిన్మెంట్ సమర్పణలో విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మిస్తున్న లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.