విశాల్ ఓ ఇంటివాడవుతున్నాడు

కోలీవుడ్‌ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. శుక్రవారం ఉదయం చెన్నైలో కోలీవుడ్‌ నటి ధన్సికతో వివాహ నిశ్చితార్ధం జరిగింది. విశాల్ తమ వివాహ నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ త్వరలోనే పెళ్ళి తేదీ ప్రకటిస్తానని చెప్పారు.

ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిపై తరచూ మీడియాలో గాసిప్స్ కూడా వస్తూనే ఉన్నాయి. అవి నిజమేనని నేడు వారు రుజువు చేశారు. నడిగర్ సంఘం (కోలీవుడ్‌ నటీనటుల సంఘం) కోసం విశాల్ ఓ భవనం నిర్మిస్తున్నారు. అది పూర్తి కాగానే పెళ్ళి చేసుకుంటానని చాలాసార్లు చెప్పారు.

చెప్పినట్లుగా ఇటీవల అది పూర్తికాగానే ధన్సిక నటించిన ‘యోగీ దా’ సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు విశాల్ హాజరయ్యి తాము ప్రేమించుకుంటున్నామని త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. పెళ్ళి తర్వాత కూడా ధన్సిక సినిమాలలో నటిస్తారని విశాల్ చెప్పారు. విశాల్ నటించిన మకుటం సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.