అఖండ-2వాయిదా... అదే కారణం!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న ‘అఖండ-2 తాండవం’ సెప్టెంబర్ 25న విడుదల కావలసి ఉండగా కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది. సినిమా కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసింది. 

అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.   

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో అఖండ-2 నిర్మిస్తున్నారు.