
హీరో టర్నెడ్ కమెడియన్ సునీల్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే తన సినిమాల ఫలితాలతో తలపట్టుకుంటున్న సునీల్ చేసే సినిమాలకు హీరోయిన్స్ కోసం కూడా కష్టాలు పడుతున్నాడట. ఇంతకీ విషయం ఏంటి అంటే ప్రస్తుతం సునీల్ ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకుని ఏ హీరోయిన్ సునీల్ సినిమా అంటే సారీ చెప్పేస్తున్నారట. ప్రస్తుతం టీ కంట్రీస్ రీమేక్ లో సునీల్ హీరోగా చేస్తున్నాడు. ఆల్రెడీ హిట్ అయిన ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఆ పాత్రలో కాస్త ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుంటుంటే అడిగిన వారంతా హీరో సునీల్ అనగానే వామ్మో అనేస్తున్నారట.
అసలకే బ్యాడ్ టైం నడుస్తున్న సునీల్ కు హీరోయిన్స్ స్ట్రైక్ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో క్రాంతి మాధవ్ సినిమాలో హీరోయిన్ గా తమిళ నటి మియా జార్జిని ఓకే చేయగా ఆమెనే ఈ సినిమాలో కూడా తీసుకునేలా చేస్తున్నారట. హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చాలు అనుకునే ఈ టైంలో మంచి క్యారక్టర్ వచ్చినా సరే సునీల్ అనగానే వెనక్కి వెళ్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఎలాగు హీరోగా వర్క్ అవుట్ అవ్వట్లేదని తెలిసి ఖైది నెంబర్ 150లో మరోసారి కమెడియన్ అవతారమెత్తిన సునీల్ ఇక మళ్లీ కమెడియన్ గా మారే ఛాన్సులు కనిపిస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. మరి సునీల్ కెరియర్ ఎటువైపు వెళ్తుందో తన సినిమాల ఫలితాలను బట్టే అర్ధం చేసుకోవచ్చు.