
ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళ్ మైత్రీ ప్రొడక్షన్: 4గా కీర్తీస్వరన్ దర్శకత్వంలో ప్రదీప్, మమిత బైజు జంటగా ‘డూడ్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా నుంచి ‘బూమ్ బూమ్...’ అంటూ సాగే పాట విడుదల చేశారు.
తెలుగులో సేనాపతి భరద్వాజ్ పాత్రుడు వ్రాసిన ఈ పాటని సాయి అభయంకర్ స్వరపరిచి దీప్తి సురేష్, భూమిళతో కలిసి పాడారు.
ఈ సినిమాలో శరత్ కుమార్, రోహిణీ మోలెట్టి, ద్రావిడ్ సెల్వం, సురేష్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం కీర్తీస్వరన్, సంగీతం: సాయి అభయంకర్, కెమెరా: నికేత్ బొమ్మి, కోరియోగ్రఫీ: అనుష విశ్వనాధన్, స్టంట్స్: యానిక్ బెన్, దినేష్ సుబ్బరాయన్, ఆర్ట్: పిఎల్ సుబేంద్, ఎడిటింగ్: భరత్ విక్రమన్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ‘డూడ్’ ఈ ఏడాది దీపావళికి 5 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.