నాగ చైతన్య సినిమాలో స్పర్ష్ శ్రీవాత్సవ్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఎన్‌సీ-24 వర్కింగ్ టైటిల్‌తో ఓ అడ్వంచర్ ట్రెజర్ హంట్ మూవీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యువ హిందీ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ నటించబోతున్నారు.

ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్‌సీ-24లోకి స్వాగతం పలికింది. స్పర్ష్ శ్రీవాత్సవ్ పలు హిందీ సినిమాలలో నటించాడు. గత ఏడాది విడుదలైన సూపర్ హిట్ హిందీ సినిమా ‘లాఫతా లేడీస్’లో నటించి మెప్పించాడు. ఇప్పుడు తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నాడు.

నాగ చైతన్య వంటి పెద్ద హీరోతో మొదటి సినిమా చేసే అవకాశం లభించడం స్పర్ష్ శ్రీవాత్సవ్ అదృష్టమనే చెప్పాలి. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వచ్చిన అనేక మంది నటీనటులు ఇలాగే మంచి ఛాన్స్ దక్కించుకొని ఆ తర్వాత తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, మళయాళ సినిమాలలో కూడా అవకాశం చేజిక్కించుకున్నారు. మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు కూడా సంపాదించుకున్నారు. కనుక స్పర్ష్ శ్రీవాత్సవ్ కూడా ఇలాగే టాలీవుడ్‌లో సెటిల్ అవుతాడేమో?     

ఎన్‌సీ-24లో నాగ చైతన్యకు జోడీగా శ్రీలీల లేదా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించబోన్నట్లు సమాచారం. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/7y9YSusitog?si=W5JlDOLbq4U4vn-u" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>