
ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ సోషియో ఫ్యాంటసీ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కూడా తేజా సజ్జా సూపర్ యోధగా నటిస్తున్నాడు.
మంచు మనోజ్ దుష్ట శక్తుల నాయకుడుగా నటిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ పోస్టర్లో వారిద్దరూ పోరాడుతున్నట్లు చూపారు. కనుక ట్రైలర్ ఏవిదంగా ఉండబోతోందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు మిరాయ్ ట్రైలర్ విడుదల చేశారు.
అయితే తమిళ్, కన్నడ వెర్షన్ ట్రైలర్లు అవే భాషల్లో పెట్టి ‘తెలుగు ట్రైలర్’ స్థానంలో ఇంగ్లీష్ ట్రైలర్ పెట్టడం హడావుడిలో జరిగిన పొరపాటు అనుకోవాలా లేక నిర్లక్ష్యమనుకోవాలా? ఏది ఏమైనప్పటికీ ట్రైలర్, దానిలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి.
ఈ సినిమాలో రీతికా నాయక్ తేజ సజ్జకు జోడీగా నటిస్తుండగా మంచు మనోజ్ దుష్టశక్తుల నాయకుడుగా నటిస్తున్నాడు. జగపతిబాబు, శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌర హరి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగెల చేస్తున్నారు.
మిరాయ్ సినిమాని సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లో నిర్మిస్తున్న మిరాయ్ వచ్చే నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.