
దేవర తర్వాత జూ.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్‌తో కలిసి మొదలు పెట్టిన సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారు. నిన్న వినాయక చవితి పండగ సందర్భంగా వారికి ఓ శుభవార్త చెప్పింది మైత్రీ పాన్ ఇండియా మూవీ మేకర్స్.
సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.
ఈ సినిమాలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఆమె ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, బీ సినిమాలలో అద్భుతంగా నటించి దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు. ఆ సినిమాలో ఆమె నటనకు ఉత్తమనటి సైమా అవార్డు అందుకున్నారు కూడా.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026 జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.