
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలో మైసూరులో మరో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు.
దీనిలో రామ్ చరణ్ బృందంపై ఓ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించబోతున్నారు. దీనిలో వెయ్యి మంది డాన్సర్లు పాల్గొనబోతున్నారు. ఈ పాటకి నృత్య దర్శకత్వ బాధ్యత జానీ మాస్టర్‌కి అప్పగించారు.
ఆయన తన వద్ద పనిచేసే ఓ ముంబై డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కొన్ని రోజులు జైల్లో ఉన్నప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ సినీ పరిశ్రమ ఆదరిస్తుందా లేదా? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పెద్ది వంటి పెద్ద సినిమాలో కోరియోగ్రఫీ చేయబోతుండటంతో జానీ మాస్టర్‌కి ఎప్పటిలాగే అవకాశాలు లభిస్తున్నాయని స్పష్టమవుతోంది.
పెద్ది సినిమా విషయానికి వస్తే, క్రికెట్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ క్రీడాకారుడుగా ఆయనకు కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.