ప్రియుడితో నివేదిత ఫోటో... త్వరలో పెళ్ళి

అల వైకుంఠ పురములో నటించిన నివేదిత పేతురాజ్ ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఆమె నటించిన ‘భూ’ అనే ఓ సినిమా జియో సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో కూడా ఎవరికీ తెలీదు.

సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గితే హీరోయిన్లు అందరు చేసే పనే ఆమె కూడా చేయబోతోంది. త్వరలో తన ప్రియుడిని వివాహం చేసుకోబోతోంది.

తాను ప్రేమిస్తున్నది ఇతనే అంటూ తన ప్రియుడుతో దిగిన రెండు ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అతని పేరు రజిత్ ఇబ్రాన్. వ్యాపారం చేస్తుంటారని సమాచారం. వారి ప్రేమ-పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదం తెలిపారు. కనుకనే నివేదిత తమ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. కనుక త్వరలోనే వారి పెళ్ళి కబురు కూడా వినిపించవచ్చు.