
కోలీవుడ్ హీరో జయం రవి (రవి మోహన్) భార్య నుంచి విడిపోయిన తర్వాత తన ప్రియురాలు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో త్వరలో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు. ముందుగా అయన తన పేరుతో ‘రవిమోహన్ స్టూడియోస్’ సొంత సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి కెనిషా ఫ్రాన్సిస్ హాజరయ్యారు. ఇద్దరూ కలిసి ప్రారంభోత్సవం చేశారు.
రవిమోహన్ స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్:1గా కార్తీక్ యోగి దర్శకత్వంలో తీయబోతున్నతొలి సినిమాలో జయం రవి హీరోగా నటించబోతున్నారు.
మరో విశేషమేమిటంటే, తమ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్: 2 సినిమాకు జయం రవి దర్శకత్వం చేయబోతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్ర చేయబోతున్నారు.
‘రవిమోహన్ స్టూడియోస్’ ప్రారంభోత్సవానికి కన్నడ నటుడు శివారాజ్ కుమార్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, సుధా కొంగర, అధర్వ తదితర కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.