సంబంధిత వార్తలు

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జోడీగా చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి “ఏం జరుగుతోంది...” అంటూ సాగే మరో రొమాంటిక్ సాంగ్ నేడు విడుదల చేశారు. రాకేందు మౌళి వ్రాసిన ఈ పాటని హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి చిన్మయి శ్రీపాదతో కలిసి పాడారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేశారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.