సంబంధిత వార్తలు

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘కింగ్డమ్’ సూపర్ హిట్ అయ్యింది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కింగ్డమ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేసింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటించగా సత్యదేవ్ కీలక పాత్ర చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు.