మహావతార్ నరసింహ మరో ట్రైలర్‌

అశ్విన్ కుమార్‌ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా గత నెల 25న థియేటర్లలో విడుదలై కనీవినీ ఎరుగని కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. ఓ భారతీయ యానిమేషన్ సినిమాకి ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ, కలెక్షన్స్ లభించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమా సూపర్ హిట్ అవడంతో హోంబలే ఫిల్మ్స్‌ ఈరోజు మరో ట్రైలర్‌ విడుదల చేశారు. అది కూడా అద్భుతంగా ఉంది.      

‘మహావతార్ నరసింహ’గా యానిమేషన్ సినిమాకి కధ: జయపూర్ణ దాస్, రుద్ర పి గోష్, అదనపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రుద్ర పి గోష్, సంగీతం: శామ్ సి, ఎడిటింగ్: అజయ్ వర్మ, అశ్విన్ కుమార్‌, పాటలు: ది శ్లోక, సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ చేస్తున్నారు. 

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శిల్పా ధావన్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు: ఎస్సీ ధావన్, దుర్గా బాలుజా.