
మురుగదాస్ దర్శకత్వంలో తీస్తున్న ‘మదరాసీ’ ట్రైలర్ ఆదివారం సాయంత్రం విడుదలైంది. ఇది మురుగదాస్ మార్క్ యాక్షన్ మూవీ అని ట్రైలర్‌తో చెప్పేశారు. తమిళనాడులో అక్రమంగా ఆయుధాల రవాణా చేస్తున్న గ్యాంగులతో హీరో చేసే పోరాటాలే మదరాసీ.
ఈ సినిమాలో ఈ సినిమాలో శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా నటిస్తున్నారు. విద్యుత్ జమ్మవల్, బిజూ మీనన్, విక్రాంత్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్. శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఏఆర్. మురుగదాస్; సంగీతం: అనిరుద్ రవిచంద్రన్: కెమెరా: సుదీప్ ఎలామన్ చేస్తున్నారు.
తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది.