
ఇదివరకు తమిళ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసేవారు. మద్యలో కొన్నేళ్ళు ఆ జోరు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మొదలైంది. తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో తీస్తున్న ‘మదరాసీ’ సినిమా అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి వరదల్లే... అంటూ సాగే పాటని విడుదల చేశారు.
రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకి అనిరుద్ సంగీతం అందించగా ఆదిత్య ఆర్కే పాడారు. ఈ సినిమాలో శివకార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా నటిస్తున్నారు. విద్యుత్ జమ్మవల్, బిజూ మీనన్, విక్రాంత్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్. శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఏఆర్. మురుగదాస్; సంగీతం: అనిరుద్ రవిచంద్రన్: కెమెరా: సుదీప్ ఎలామన్ చేస్తున్నారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/2-107JgeWZ8?si=o093puBjd6eyRfOj" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>