మా ఇంటి బంగారం నందిని రెడ్డి చేతికే

సమంత తన సొంత సినీ నిర్మాణ సంస్థ బ్యానర్‌ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో తీసిన తొలి సినిమా ‘శుభం’తో మెల్లగా ప్రయాణం మొదలుపెట్టారు. దాని కంటే ముందు మొదలుపెట్టిన ‘మా ఇంటి బంగారం’ మాత్రం నేటికీ మొదలుపెట్టనే లేదు.

ఈ సినిమా 1980 దశాబ్దం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ సాగే క్రైమ్‌ థ్రిల్లర్ అని టైటిల్‌ లుక్ పోస్టర్‌లోనే చెప్పేశారు. దీనిలో సమంత ప్రధానపాత్ర చేస్తారు.

ఇప్పుడీ సినిమా బాధ్యతను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. వారిరువురు కలిసి చేసిన ‘ఓహ్ బేబీ’ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కనుక ఈ హీరోయిన్‌ ఓరియంటడ్‌ సినిమాని నందిని రెడ్డి అయితేనే సరిగ్గా హ్యాండిల్ చేయగలరని భావించి ఆమెకీ సినిమా బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదలుపెట్టబోతున్నారు కనుక త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.