
మరో చిన్న తెలుగు సినిమా బ్రహ్మాండ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కనుక ఈరోజు ఆ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఒక గ్రామంలో అర్ధరాత్రి పూట అమ్మవారి రూపంలో తిరుగుతున్న ఓ మహిళ వరుసగా అనేక మందిని చంపివేస్తుంటుంది. ఆమె అమ్మవారి వేషధారణలో ఎందుకు తిరుగుతోంది? ఆవిధంగా మనుషులను ఎందుకు చంపేస్తోంది?అనే క్రైం థ్రిల్లర్ స్టోరీని ‘బ్రహ్మాండం’ పేరుతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఈ సినిమాలో బన్నీ రాజు, ఆమని, జయరాం, కొమరం, ప్రసన్న కుమార్, విజయ రంగ రాజు, దేవిశ్రీ, ఆనంద్ భారతి, కోశోర్ దాసు, మీసం సురేష్, అమిత్ తివారీ, జోగిని శ్యామల, శరత్ బాబు, అనంత్, దిల్ రమేష్, కార్తనందన్, బలగం రమేష్, ఛత్రపతి శేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాంబాబు; సంగీతం: వరికుప్పల యాదగిరి; కెమెరా: కాసుల కార్తీక్; కోరియోగ్రఫీ: రాజు కోనేటి, కలందర్ మాష్టర్; ఎడిటింగ్: ఎంవీ వర్మ చేశారు.
మమతా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాసరి సురేష్ నిర్మించిన బ్రహ్మాండం ఈ నెల 29న విడుదల కాబోతోంది.