
పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి ఒకటో రెండో వస్తుండటంతో చిన్న హీరోలు ఈ గ్యాప్‌ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అటువంటిదే బ్యూటీ సినిమా కూడా. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది.
ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నిలాఖి పాత్ర, విజయ నరేష్ కృష్ణ, వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహార, నితిన్ ప్రసన్న, మురళి గౌడ్, నంద గోపాల్, నాగేంద్ర మేడిద తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: ఆర్ వీ సుభ్రహ్మన్యం; డైలాగ్స్, దర్శకత్వం: జేఎస్ఎస్ వర్ధన్; సంగీతం: విజయ్ బుల్గానిన్; కెమెరా: శ్రీ సాయికుమార్ దార; ఎడిటింగ్: ఎస్‌బిఉ ఉద్ధవ్; ఆర్ట్: బేబీ సురేష్ భిమగన్ చేశారు.
వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఏ విజయ్ కుమార్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది.