
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం 158వ సినిమా ప్రకటన వెలువడింది. దాంతోపాటు ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.
వాల్తేర్ వీరయ్యకు చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ, లోహిత్ కలిసి ఈ సినిమా నిర్మిస్తారు.
చిరంజీవి విశ్వంభర ముగించిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవర ప్రసాద్ గారు’ టైటిల్‌తో ఓ సినిమా మొదలుపెట్టారు. అది జనవరిలో సంక్రాంతి పండుగకు ముందు విడుదలవుతుంది.
కనుక నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ రెండో వారంలోగా అది పూర్తికాగానే బాబీతో 158వ సినిమా మొదలుపెడతారు. ఆలోగా దర్శకుడు బాబీ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటారు.
ఇప్పుడు పెద్ద హీరోల సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ళు తీయాల్సిందే అన్నట్లు సాగుతోంది. కానీ చిరంజీవి ఈ ఒక్క ఏడాదిలో వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నారు. అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైనరన్న విషయం ఏముంటుంది?