
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడితో మొదలుపెట్టిన సినిమా టైటిల్ ప్రకటించారు.
చిరంజీవి అసలు పేరే ఈ సినిమా టైటిల్. అది కూడా... తెలుగు ప్రజలు రోజూ మాట్లాడుకుంటున్నట్లుగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ అని చక్కటి టైటిల్ పెట్టి ‘పండగకి వస్తున్నారు..’ అని సబ్ టైటి ల్లా తగిలించడం చాలా బాగుంది.
టైటిల్ గ్లిమ్స్ కూడా చిరంజీవి అభిమానులు చాలా సంతోషపడే విధంగా ఉంది. అభిమానులు చిరంజీవిని ఏవిదంగా చూడాలనుకుంటారో అలా చూపారు అనిల్ రావిపూడి. సినిమా టైటిల్‌తోనే మంచి మార్కులు కొట్టేశారని చెప్పవచ్చు.
అయితే సినిమాలో చిరంజీవి కోసం ఒకటి రెండు ఫైట్లు పెట్టవచ్చు కానీ ఆయనలో కామెడీ టైమింగ్ వాడుకోవదానికే అనిల్ రావిపూడి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని భావించవచ్చు. ఈ సినిమా టైటిలే ఇందుకు ఓ ఉదాహరణ లేకుంటే పవర్ ఫుల్ టైటిల్ పెట్టి ఉండేవారు కదా?
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుండగా క్యాథరిన్ రెండో హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మన శంకర వరప్రసాద్ గారితో పాటు హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది.