
తెలుగు సినీ పరిశ్రమలో మూడు వారాలుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మె ముగిసింది. నిర్మాతలకు, సినీ కార్మికులకు మద్య వేతన ఒప్పందం కుదిరింది. సినీ కార్మికులు 30 శాతం పెంపు కోరినప్పటికీ చర్చల తర్వాత 22.5 శాతం పెంపుకు అంగీకరించారు. దాని ప్రకారం రోజుకి రూ. జీతం అందుకుంటున్నవారికి ఈ ఏడాది 15 శాతం, వచ్చే ఏడాది 2.5 శాతం, మూడో ఏడాదిలో 5 శాతం చొప్పున జీతాలు పెంచుతారు.
రోజుకి రూ.2,000-5,000 మద్య జీతం అందుకుంటున్నవారికి తొలి ఏడాది 7.5 శాతం ఆ తర్వాత రెండేళ్ళలో వరుసగా ఏడాదికి 5 శాతం చొప్పున పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. దీనికి సినీ కార్మికులు కూడా అంగీకరించడంతో సమ్మె విరమించి నేటి నుంచి షూటింగ్‌లకు హాజరవుతామని ప్రకటించారు.
సిఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎఫ్‌డీసీ, కార్మికశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో సుదీర్గ చర్చలు తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.