విశ్వంభర ఫస్ట్ గ్లిమ్స్‌...

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన సినిమాలతో మనల్ని అలరిస్తున్న మన మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం ‘విశ్వంభర’ ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు. చిరంజీవి చెప్పినట్లుగానే ఫస్ట్ గ్లిమ్స్‌లో గ్రాఫిక్ వర్క్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కనుక సినిమా కోసం వచ్చే ఏడాది వేసవి దాక ఎదురుచూడక తప్పదు. 

చిరంజీవి మళ్ళీ చాలా కాలం తర్వాత చేస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ సినిమాకి మల్లాది వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. ఆషికా రంగనాధ్, కునాల్ కపూర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

 ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, పాటలు: శ్రీ శివశక్తి దత్త, చంద్రబోస్, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, సంతోష్ కామిరెడ్డి అందిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి విశ్వంభర నిర్మిస్తున్నారు.