
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఓ శుభవార్త కోసం ఆత్రుత్రగా ఎదురుచూస్తున్నారు అదే... విశ్వంభర టీజర్... సినిమా రిలీజ్ డేట్! ఈరోజు ఉదయం 9.09 గంటలకు మెగాబ్లాస్ట్ అంటూ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. అంటే టీజర్ రిలీజ్ చేసి దానిలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా ‘మెగాబ్లాస్ట్’లో చిరంజీవి ప్రత్యక్షమయ్యారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా గ్రాఫిక్ వర్క్స్ ఉన్నాయని, అవి పూర్తికాకపోవడం వల్లనే సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని చెప్పారు. అయితే సినిమా రిలీజ్ డేట్ గురించి నేను చిన్న లీక్ ఇస్తున్నానంటూ వచ్చే ఏడాది వేసవిలో విశ్వంభర రిలీజ్ అవుతుందని చెప్పేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త అనుకోవాలా లేక షాక్ అనుకోవాలా?
‘మెగాబ్లాస్ట్’ అంటే టీజర్ అనుకుంటే చిరంజీవి ఈవిదంగా ప్రకటించడం అభిమానులకు కొంత షాక్ ఇచ్చినప్పటికీ రేపు తన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని గంటల ముందు అంటే గురువారం సాయంత్రం 6. 06 గంటలకు గ్లింప్స్ విడుదల చేస్తామని చెప్పి కాస్త ఉపశమనం కలిగించారు.
ఇదంతా ఎందుకు... చిరంజీవి ఏమన్నారో అయన మాటల్లోనే వినండి...