నన్ను మిస్ అవుతున్నారా? నాగ వంశీ ప్రశ్న

ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఇటీవల వార్-2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “ఈ సినిమా బాగోకపోతే ఇకపై ఎన్నడూ మైక్ పట్టుకొని మీ ముందుకు రాను,” అన్నారు. కానీ వందల కోట్ల బారీ బడ్జెట్‌ పెట్టి పాన్ ఇండియా మూవీగా తీసిన వార్-2 విడుదలైన వారం రోజులకే చతికిలపడింది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో నాగ వంశీ దుబాయ్‌ వెళ్లిపోయారని, సెల్ ఫోన్‌ స్విచ్చాఫ్ చేశారంటూ సెటైర్లు వేస్తున్నారు. 

వీటిపై నాగ వంశీ స్పందించరనుకుంటే అయన కూడా వ్యంగ్యంగా స్పందించారు. “ఏమిటి అప్పుడే నన్ను మిస్ అవుతునట్లున్నారు?వంశీ అదీ వంశీ ఇదీ అంటూ సోషల్ మీడియాలో నా గురించి మంచి గ్రిప్పింగ్ స్టోరీస్ వ్రాస్తున్నారు. ఎక్స్‌లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు క్షమించండి. కానీ ఇంకా ఆ టైమ్‌ (సినీ పరిశ్రమ నుంచి తప్పుకునే సమయం) రాలేదు. మరో 10-15 ఏళ్ళు ఉంది. సినిమాకు దగ్గరగా... సినిమా థియేటర్లలో... సినిమా కోసమే ఎల్లప్పుడూ... మా నెక్స్ట్ మూవీ మాస్ జాతరలో కలుద్దాం,” అంటూ నాగవంశీ ట్వీట్ చేశారు.