మరికాస్త ఆలస్యంగా... మాస్ జాతర?

సినీ కథా రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ, శ్రీలీల జంటగా చేసిన ‘మాస్ జాతర’ ఈ నెల 27న వినాయక చవితికి విడుదల కావలసి ఉంది. కానీ వివిధ కారణాల వలన సినిమా రిలీజ్ ఆలస్యం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు మరో వారం రోజులలో విడుదల కావలసిన ఈ సినిమా గురించి ఊరికే ఇటువంటి ఊహాగానాలు మొదలవవు. ఇటువంటి వాటిపై వెంటనే స్పందించే నిర్మాత నాగ వంశీ ఇంతవరకు స్పందించ లేదు.

కనుక సినిమా వాయిదా పడబోతోందా లేదా ఆగస్ట్ 27నే విడుదల చేసి వాటికి చెక్ పెట్టాలనుకుంటున్నారా? అనే విషయం నేడో రేపో తెలుస్తుంది.     

ఈ సినిమా పేరులోనే ‘మాస్’ ఉంది కనుక టీజర్‌ అలాగే ఉంది. కనుక సినిమా కూడా అలాగే ఉంటుంది. అందుకు సిద్దపడే థియేటర్లకు వెళ్ళడం మంచిది. ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీసుగా నటించారు.       

ఈ సినిమాలో నితీష్ కుమార్, కృష్ణ కుమార్, రితూ పి సూద్, పండు చిరుమామిళ్ళ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన మాస్ జాతరకు  సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 20కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ దర్శక నిర్మాతలు ఇంకా ద్రువీకరించాల్సి ఉంది.