విశ్వంభర ఈ ఏడాదిలో విడుదల కాదా?

మల్లాది వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి త్రిష జోడీగా చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రంలో   బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ పాల్గొన్న ప్రత్యేక గీతంతో ‘విశ్వంభర’ షూటింగ్‌ పూర్తయింది.

కానీ ముందుగా అనుకున్నట్లు 2026లో సంక్రాంతి పండగకి కూడా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కంప్యూటర్ గ్రాఫిక్ పనులు ఆలస్యం అవుతుండటంతో 2026, ఏప్రిల్ లేదా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

విశ్వంభరలో చిరంజీవి ‘భీమవరం దొరబాబు’గా నటించగా ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్, సురభి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. 

ఎల్లుండి అంటే ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర ఎప్పుడు విడుదల చేసేదీ చెపుతారేమో?

ఈ సినిమా పూర్తి చేయగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా మొదలుపెట్టేశారు. ఆ సినిమాలో  చిరంజీవికి జంటగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2026, సంక్రాంతి పండుగకు విడుదల చేస్తామని అనిల్ రావిపూడి ముందే చెప్పి షూటింగ్‌ ప్రారంభించారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసి నాలుగో షెడ్యూల్ చేస్తున్నారు.