అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో హరిహర వీరమల్లు

ఏపీ డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన పాత్ర చేసిన హరిహర వీరమల్లు సినిమా ఆగస్ట్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి వచ్చేస్తోంది. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా 5 భాషలో తీసిన ఈ సినిమా జూలై 24న విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది.

సుమారు నాలుగేళ్ళపాటు ఈ సినిమా ఆలస్యం అవడంతో ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్న క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ మిగిలిన భాగం పూర్తి చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

16వ శతాబ్దంలో ఔరంగజేబు హయంలో ఈ కధ జరిగినట్లు చూపారు. ఔరంగజేబు (బాబీ డియోల్) హిందువులను మత మార్చుకోమని ఏవిదంగా పీడించేవారో, అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు కూడా భారత్‌ని ఏవిదంగా దోచుకునే వారో ఈ సినిమాలో చూపారు. 

బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా మెసులుకునే రాజుల సంపదని వీరమల్లు (పవన్‌ కళ్యాణ్‌) దోచుకొని పేదలకు పంచి పెడుతుంటారు. బందరు నుంచి హైదరాబాద్‌ నవాబ్ కుతుబ్ షాహీ వద్దకు తీసుకువెళుతున్న వజ్రాలను హైదరాబాద్‌, చార్మినార్ వద్ద దోచుకుంటాడు. 

దీంతో ఔరంగజేబు వద్ద గల కోహినూర్ వజ్రాన్ని తీసుకువచ్చే బాధ్యతని వీరమల్లుకే అప్పజెప్పుతాడు నవాబు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలా జరిగిందనేదే హరిహర వీరమల్లు సినిమా. ఎలాగూ మరికొన్ని గంటలలో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి హరిహర వీరమల్లు వచ్చేస్తున్నాడు కనుక అతని గురించి సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది.