
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ లో 8 ని హైలెట్ చేస్తూ వచ్చారు. అసలు ధ్రువ టైటిల్ లో పెట్టిన ఆ 8 సీక్రెట్ ఏంటి అంటే అది నవదీప్ కు తెలుసని అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో విలన్ దగ్గర ఇరుక్కుపోయిన నవదీప్ కోసమే చెర్రి 8 ఫార్ములాలను అప్లై చేస్తాడట. సో మాత్రుక కన్నా ఇందులో ఆ ఫార్ములా సూపర్ కిక్ అందిస్తాయట.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందిస్తున్నారు. బ్రూస్ లీ ఫ్లాప్ తో ఢీలా పడ్డ మెగా ఫ్యాన్స్ ఈ సినిమాతో ఖుషి చేసేందుకు చూస్తున్నారు చరణ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయిన 5 గంటల్లోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిందంటే ఇక సినిమా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు.
ఇక చాన్నాళ్ల తర్వాత నవదీప్ కు ఈ సినిమాలో ఓ మంచి రోల్ పడ్డదని తెలుస్తుంది. హీరోగా దాదాపు ఫేడవుట్ అయిన నవదీప్ ఇలా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. మరి ధ్రువ నవదీప్ కెరియర్ కు మంచి బూస్టప్ అందిస్తుందని చెప్పొచ్చు.