
సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం జంటగా చేస్తున్న ‘లిటిల్ హార్ట్స్’ టీజర్ ఈరోజు విడుదలైంది.
ఇటీవలే మా రాజగాడికి... అంటూ సాగే తొలిపాట విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు విడుదలైన టీజర్ కూడా బాగానే ఉంది. ఇంటర్-డిగ్రీ విద్యార్ధుల కుటుంబ నేపధ్యాలు, చదువులు, కాలేజీలలో హ్యాపీ డేస్, వారి ప్రేమలే ఈ లిటిల్ హార్ట్స్. ఇది యువతకు, మిడిల్ క్లాస్ తల్లితండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కనుక చక్కగా తెరకెక్కించగలిగితే ‘హ్యాపీ డేస్’లా సూపర్ హిట్ ఖాయం.
ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య కృష్ణ, ఎస్ఎస్ కంచి, అనితా చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాయి మార్తాండ్ , సంగీతం: సంజిత్ ఎర్రమిల్లి, కెమెరా: సురియా బాలాజీ, ఎడిటింగ్: శ్రీధర్ సొంపల్లి చేస్తున్నారు.
బన్నీ వాసు, వంశీ నందిపాటి ఎంటర్టెయిన్మెంట్ సమర్పణలో విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మిస్తున్న లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://youtu.be/Iwp_cND1ZPw?si=lum3rlzZ9X3voRCQ