
రిషబ్ శెట్టి కధ, స్వీయ దర్శకత్వంలో చేసిన సూపర్ హిట్ సినిమా ‘కాంతారా’కు ప్రిక్వెల్‌గా వస్తున్న ‘కాంతారా: చాప్టర్-1’ నుంచి ఓ చిన్న అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ‘కులశేఖర్’గా నటిస్తున్న గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు. తలపై కిరీటం, బంగారు ఆభరణాలతో రాజుగారి వేషంలో గుల్షన్ దేవయ్యని చూపారు. కనుక ఈ ఛాప్టర్‌లో చారిత్రిక నేపధ్యం కలిగిన అంశాలతో కధ నడిపించబోతున్నట్లు స్పష్టమవుతుంది.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోని నేడు విడుదల చేసింది. అది చూస్తే ఈ సినిమా మరింత అద్భుతంగా ఉంటుందని స్పష్టమవుతుంది.
కాంతారా: చాప్టర్-1లో జయరామ్, రాకేష్ పూజారి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: బి.అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ: అర్వింద్ కాశ్యప్, ఆర్ట్: ధరణి గంగేపుత్ర, వీఎఫ్ఎక్స్: సంజిత్ కె.వి చేశారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూరు నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న (గాంధీ జయంతి) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
'కులశేఖర'గా గుల్షన్ దేవయ్య.
Introducing @gulshandevaiah as ‘KULASHEKARA’ from the world of #KantaraChapter1.
In Cinemas #KantaraChapter1onOct2 🔥#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets #ArvindKashyap @AJANEESHB @Banglan16034849… pic.twitter.com/fStOG5MtLn