రష్మిక మరో హిందీ చిత్రం ‘తమ’ టీజర్‌

పుష్ప-1,2, యానిమల్ సినిమాలతో రష్మిక మందన పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ ఏవిదంగా తెలుగు సినిమాలు చేస్తోందో అదే విదంగా రష్మిక మందన కూడా హిందీ సినిమాలు చేస్తున్నారు. 

ఆమె తాజా హిందీ చిత్రం ‘తమ’ టీజర్‌ మంగళవారం విడుదలైంది. యానిమాల్ సినిమాలో లాగే దీనిలో కూడా రష్మిక అందాలు ఆరబోసి లిప్ లాక్ సీన్లు చేసి బాలీవుడ్‌ హీరోయిన్లులకు తానేమీ తీసిపోనని మరోసారి నిరూపించబోతున్నారు. ఇదో హర్రర్ కామెడీ సినిమా అని టీజర్‌తో చెప్పీశారు. 

ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన, పరేష్ రావెల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఆదిత్య సర్పొట్దార్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాకు కధ: నీరెన్ భట్, సురేష్ మాథ్యూ, అమర్ కౌశిక్; సంగీతం: సచిన్-జిగర్; కెమెరా: సౌరభ్ గోస్వామి చేస్తున్నారు.

మాడ్ దర్శకత్వంలో ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి పండుగకు విడుదల కాబోతోంది.