రావు బహదూర్ టీజర్‌

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన కధలు, పాత్రలు చేసే నటులలో సత్యదేవ్ ఒకరు. అతను ఈసారి ‘రావు బహదూర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ వృద్ధుడైన ‘రావు బహదూర్’గా నటిస్తున్నారు. ‘రావు బహదూర్’ టీజర్‌ రాజమౌళి చేతుల మీదుగా సోమవారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేశారు. టీజర్‌లో సత్యదేవ్ ‘రావు బహదూర్’గా అదరగొట్టేశారు.  

‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వికాస్ ముప్పల, దీప థామస్, బాలీవుడ్‌లో పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్‌ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, ఎడిటింగ్: వెంకటేష్ మహా, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్ చేస్తున్నారు

జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ+ఎస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి ‘రావు బహదూర్’ నిర్మిస్తున్నారు. 

రావు బహదూర్ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/IEzfl28GEy4?si=NvwW57CQZlw--jrV" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>