
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏ రేంజ్ కు వెళ్లాడో తెలిసిందే. ఓ రెండు సంవత్సరాల దాకా 5,6 కోట్ల హీరోగా ఉన్న ప్రభాస్ బాహుబలికి 15 కోట్ల దాకా తీసుకున్నాడని టాక్. ఇక పార్ట్-2 కు సెపరేట్ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. ఇక ఇదే క్రేజ్లో తన తర్వాత సినిమా కూడా రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదట. యువి క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ డైరక్షన్లో ప్రభాస్ సినిమా ఓకే చేశాడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు గాను ప్రభాస్ అక్షరాల 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్.
రన్ రాజా రన్ తో డైరక్టర్ గా మారిన సుజిత్ ఆ ఒక్క సినిమాతోనే తన ఉన్న టాలెంట్ ఏంటో అందరికి చూపించాడు. ఇక అదే క్రేజ్ రెండో సినిమానే ఏకంగా ప్రభాస్ ను డైరెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. బాహుబలి లాంటి హిట్ అందుకున్న తర్వాత సుజిత్ లాంటి ఒక్క సినిమా అనుభవమున్న డైరక్టర్ తో చేయడం కాస్త రిస్క్ అన్నట్టు కనిపిస్తున్నా సుజిత్ ఈ కథ మీద రెండు మూడు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాడు. యువి వారికి కథ మీద మంచి నమ్మకం ఏర్పడింది. అందుకే సుజిత్ ను డైరక్టర్ గా ప్రభాస్ తో సినిమా తీస్తున్నారు.