రావు బహదూర్ టీజర్‌ రెడీ... ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్ ఈసారి ‘రావు బహదూర్’గా ప్రేక్షకులా ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ‘రావు బహదూర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో సత్యదేవ్ వృద్ధుడైన ‘రావు బహదూర్’గా చూసి ప్రేక్షకులు షాక్ అయ్యుంటారు. ఇప్పుడు ‘రావు బహదూర్’ టీజర్‌ రాజమౌళి చేతుల మీదుగా సోమవారం ఉదయం 11.07 గంటలకు విడుదల కాబోతోంది. టీజర్‌తో మరెలాంటి షాక్ ఇస్తారో చూడాలి. 

‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మహాయాన బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి ‘రావు బహదూర్’ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్ చేస్తున్నారు. టీజర్‌ ఇప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ రావు బహదూర్ మాత్రం కాస్త సమయం సందర్భం చూసుకొని వచ్చే ఏడాది వేసవిలో తాపీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.