
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘రాజాసాబ్’ లో ప్రభాస్‌కు ముగ్గురు హీరోయిన్లున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారిలో నిధి అగర్వాల్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజాసాబ్ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ తాతగారిగా నటిస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “తెలుగు బయ్యర్స్ రాజాసాబ్‌ని జనవరి 9న సంక్రాంతికి ముందు విడుదల చేయాలని అడుగుతున్నారు. కానీ హిందీ బయ్యర్లు డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని కోరుతున్నారు.
డిసెంబర్ 5 లేదా 6 తేదీలలో రిలీజ్ చేసినట్లయితే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా కలిసి వస్తాయని మేము భావిస్తున్నాము.
ఒకవేళ సంక్రాంతికి విడుదల చేస్తే రాజాసాబ్ వలన మిగిలిన సినిమాలకు, వాటి వలన మా రాజాసాబ్‌కు ఇబ్బంది కలుగుతుంది.
కనుక డిసెంబర్ 5 లేదా 6 తేదీలలోనే రాజసాబ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాము,” అని చెప్పారు. రాజాసాబ్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. సాంగ్స్ ఇంకా చేయాలి. వీఎఫ్ఎక్స్ పనులు జోరుగా సాగుతున్నాయని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.