ఒకేసారి రెండు సినిమాలు చేయనున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ-2: తాండవం’ సినిమా పూర్తి చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఒకేసారి ఇద్దరు దర్శకులతో రెండు సినిమాలు చేయబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఆదిత్య 369’కి సీక్వెల్ ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నవంబర్‌లో ఈ రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.

ఇక నుంచి ఏడాదికి నాలుగు సినిమాలు తప్పనిసరిగా చేస్తానని బాలకృష్ణ ఇటీవలే ఓ సినిమా కార్యక్రమంలో చెప్పారు. కనుక ఈ మూడు సినిమాలు కాకుండా మరొకటి చేయాల్సి ఉంది.

రజనీకాంత్ సూపర్ హిట్ సినిమా జైలర్‌కి సీక్వెల్‌గా జైలర్-2 చేయబోతున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణ కూడా ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అవి నిజమే అయితే ఈ ఏడాది బాలకృష్ణ చేయబోయే నాలుగవ సినిమా జైలర్-2 కావచ్చు.