
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఓజీ’లో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈరోజు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్ రెండు విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు కన్మణి అని ఫస్ట్ లుక్ పోస్టర్లో తెలియజేశారు.
ఓజీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య చాలా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. ఓజీ సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కాబోతోంది.
Every storm needs its calm. 
Meet KANMANI - @PriyankaaMohan ❤️
Very soon, let’s all meet with the soulful second single promo…#OG #TheyCallHimOG pic.twitter.com/hVXUbA99OD