భారతీయ ప్రేక్షకులకు పౌరాణిక సినిమాలు కొత్తేమీ కావు. దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు. వాటిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, యమధర్మరాజు ప్రధానపాత్రలుగా తీసిన సినిమాలకు లెక్కే లేదు. కానీ ఎన్ని సినిమాలు తీసిన తరగని సారం మన పురాణాలది. కనుక మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉన్నారు. ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.
అటువంటి మరో ప్రయత్నమే శ్రీకృష్ణా అవతార్ ఇన్‌ఛార్జ్ మహోబా. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు యుద్దవీరుడుగా చూపబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారానే తెలియజేశారు దర్శకుడు ముకుంద్ పాండే! ఆయనే ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారు. శ్రీ అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాయి.
11-12 శతాబ్దాల క్రితం మహోన్నతమైన మహోబా సాంస్కృతిక వైభవాన్ని, శ్రీ కృష్ణుడిలో దైవత్వం, ఆధ్యాత్మికత, శౌర్య ప్రతాపాలు ఈ సినిమాలో చూపించబోతున్నామని దర్శకుడు ముకుంద్ పాండే తెలిపారు.
దీనిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన సాంకేతిక నిపుణులు పనిచేస్తారని చెప్పారు. త్వరలోనే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.