సార్ మేడం... అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తున్నారు

విజయ్ సేతుపతి-నిత్యా మీనన్ జంటగా చేసిన ‘సార్ మేడం’ ఫ్యామిలీ డ్రామా సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు వారిరువురూ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలోకి ‘సార్ మేడం’ సినిమా ప్రసారం కాబోతోందని నిర్మాణ సంస్థ తెలియజేసింది.  

ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక వారి మద్య గొడవలు మొదలవుతాయి. చివరికి విడాకులు తీసుకునేందుకు సిద్దపడతారు. వారి గొడవలకు కారణం ఏమిటి చివరికి ఏం జరిగింది? అనేదే ఈ సినిమా. ఇద్దరూ గొప్ప నటులే కనుక తమ నటనతో ప్రేక్షకులను కట్టి పడేశారు.      

పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్, కెమెరా: ఎం.సాయి కుమార్‌, స్టంట్స్: కలై కింగ్‌స్టన్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్, ఆర్ట్: కె. వీరసమార్ చేశారు.