నారా రోహిత్. నాగశౌర్య మరోసారి..!

ఓ కాంబినేషన్ హిట్ అయితే మళ్లీ అదే కాంబోతో సినిమాలు చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యనే జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ అందుకున్న నారా రోహిత్, నాగ శౌర్యలు ఆ సినిమా విజయం చాలా కీ రోల్ పోశించారు. ఇక దాని తర్వాత ఎవరికి వారు సినిమాలతో బిజీ అవ్వగా మరోసారి ఇద్దరు కలిసి నటిస్తున్నారట. ఈసారి మాత్రం ఇద్దరి మధ్య ఫైట్ సీన్ కూడా ఉంటుందట. నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా కథలో రాజకుమారి. ఈ సినిమాలో హీరో ప్రయత్నాల్లో ఉండే రోల్ చేస్తున్న నారా రోహిత్ కు ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడట నాగ శౌర్య. 

మహేష్ సూరపనేని డైర్కెట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య అలా కనిపించనున్నాడట. అయితే జ్యో అచ్యుతానందలో లాగా బ్రదర్స్ లా కాకుండా ఈసారి ఒకరంటే ఒకరు పడని పాత్రలో నటిస్తున్నారట. కొద్ది సేపే అయినా నాగ శౌర్య పాత్ర సినిమాకు చాలా కీలకం అంటున్నారు. అంతేకాదు మంచు లక్ష్మి ఇందులో సినిమా నిర్మాతగా కనిపిస్తున్నారు. సో ఇన్ని క్రేజీ కాంబినేషన్స్ తో నారా రోహిత్ కథలో రాజకుమారి ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని ఆశిద్దాం.