
బాలీవుడ్ నటుడు అమీర్ షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఈ సినిమాని యూట్యూబ్లో అందుబాటులో ఉంచారు.
ప్రస్తుతం రూ.100 అద్దె చెల్లించి ఈ సినిమాని యూట్యూబ్లో చూడవచ్చు. కానీ రేపు పంద్రాగస్ట్ సందర్భంగా ఈ సినిమాని కేవలం రూ. 50 లకే చూడవచ్చు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం మనకు నచ్చిన భాషలో ఈ సినిమా చూడవచ్చు.
కానీ ఈ ఆఫర్ ఆగస్ట్ 15, 16, 17 మూడు రోజుల వరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వంద రూపాయలు చెల్లించి చూడాల్సి ఉంటుంది.
అమీర్ ఖాన్ చేసిన సినిమాలలో దాదాపు ప్రతీ సినిమా విలక్షణమైనదే... దాదాపు ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతూనే ఉంది. అలాంటి విలక్షణమైన సూపర్ హిట్ సినిమాయే ‘సితారే జమీన్ పర్.’ కనుక థియేటర్లో ఈ సినిమా చూడలేకపోయిన వారు యూట్యూబ్లో చూడవచ్చు.
ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు.