కిష్కిందపురి టీజర్‌ రేపు సాయంత్రం 4 గంటలకు....

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌ జోడీగా చేస్తున్న ‘కిష్కిందపురి’ టీజర్‌ ఆగస్ట్ 15 సందర్భంగా రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేడు విడుదలైన కూలీ, వార్-2 సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లలో కిష్కిందాపురి టీజర్‌ చూడవచ్చు. ఈ విషయం తెలియజేస్తూ ‘సువర్ణమాయ రేడియో స్టేషన్ మీ రాక ఎదురు చూస్తుంది...అంటూ వేసిన పోస్టర్‌ కూడా చాలా వెరైటీగా ఆకట్టుకునేలా ఉంది.    

  ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి, సహ రచయిత: దరహాస్ పాలకొల్లు, కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: శామ్ సీఎస్, చైతన్ భారద్వాజ్, ఆర్ట్: శివ కామేష్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, అడిషనల్ స్కీన్‌ ప్లే: బాల గణేష్. 

 షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 12న విడుదలకాబోతోంది.