
మోహన్ శ్రీవాత్స దర్శకత్వంలో సత్యరాజ్, సత్యం రాజేష్, సాంచి రాయ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను ముఖ్యపాత్రలు చేసిన ‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్ నేడు విడుదలైంది.
ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక క్రైం థ్రిల్లర్ స్టోరీని సోషియో ఫాంటసీతో ముడిపెట్టి తీసిన సినిమా ఇది. దీనిని ఇంతే చక్కగా సినిమాగా చూపించగలిగితే తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మోహన్ శ్రీవత్స, సంగీతం: ఇన్‌ఫ్యూషన్ బ్యాండ్, కెమెరా: కుషేందర్ రమేశ్ రెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్: శ్రీనివాస్ పున్నా, స్టంట్స్: రామ్ సుంకర, కొరియోగ్రఫీ: బిశ్వర్ పెంటి చేశారు.
మారుతి టీమ్ సమర్పణలో ఈ సినిమాని వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై అడిదల విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది.