దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ పూర్తి కాగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మొదలుపెట్టబోతున్నారని బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ రెండు నెలల క్రితమే చెప్పారు.
ఆయన చెప్పినట్లుగానే స్పిరిట్ మొదలవుతుంది. సెప్టెంబర్ నెలాఖరున హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం నిర్వహించి, వెంటనే విదేశాలలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు.
ఇప్పటికే సందీప్ రెడ్డి మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్, మెక్సికోలో పర్యటించి లొకేషన్స్ ఫైనల్ చేశారు. అక్కడ షూటింగ్ జరిపేందుకు ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని సమాచారం.
ఈ సినిమాని భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ప్రణయ రెడ్డి వంగా కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి దిమ్రీ అవకాశం దక్కించుకుంది. ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటించబోతున్నారు.