ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అధినేత అనిల్ సుంకర ‘షో టైమ్- సినిమా తీద్దాం రండి’ పేరుతో ఓ రియాల్టీ షో చేయబోతున్నారు.
సినీ పరిశ్రమలో సినిమాలు ఏవిదంగా తీస్తారో తెలుసుకోవాలని సాధారణ ప్రజలు, ప్రేక్షకులకు చాలా ఆసక్తి చూపుతుంటారు. కనుక సినిమా ఎలా తీస్తారో చూపేందుకు దీనిని ప్లాన్ చేశారు.
దీని కోసం ఔత్సాహిక నటీనటులు, రచయితలు, డైలాగ్ రైటర్లు, పాటల రచయితలు, ఎడిటర్లు, దర్శకులు, అసిస్టెంట్ దర్శకులు, ఆర్ట్ దర్శకులు, పబ్లిసిటీ డిజైనర్లు తదితరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో ‘సినిమా తీద్దాం రండి’ పేరుతో ఓ పోస్ట్ పెట్టారు.
సినీ పరిశ్రమలో చేరాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా తమకు అభిరుచి ప్రవేశం, పట్టు ఉన్న విభాగాలలో contact@ak.movie కి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవవచ్చు.
సినీ పరిశ్రమలో ప్రవేశించాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ చాలా మంది ప్రయత్నాలు ఫలించక నిరాశ చెందుతుంటారు. అటువంటి వారికి ఇది సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

🎬 Producer @AnilSunkara1 announces First-of-its-Kind Reality Show on Movie Making – #ShowTime – #CinemaTeeddamRandi 🎥

📢 Actors, Writers, Editors & more… This is YOUR stage!

📩 Apply Now: contact@ak.movie @ATVOriginals @AKentsOfficial pic.twitter.com/PFuMB2IAVF
— Telugu360 (@Telugu360) August 12, 2025