సతీ లీలావతి నుంచి చిత్తూరు పిల్లా...

లావణ్య త్రిపాఠీ వివాహం తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా ‘సతీ లీలావతి.’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి చిత్తూరు పిల్లా... అంటూ సాగే హుషారైన లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. వనమాలి వ్రాసిన ఈ పాటని మికీ జే మేయర్ స్వరపరిచి సంగీతం అందించగా నూతన మోహన్, కృష్ణ తేజస్వీ, రితేష్ జి రావు హుషారుగా పాడారు.  

సతీ లీలావతిలో దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. నరేష్, విటివి గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సిదిఖీ, తాగుబోతు రమేష్, జోషి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి సంగీతం: మికీ జే మేయర్, కెమెరా:బైనేంద్ర మీనన్, ఎడిటింగ్: సతీష్ సూర్య, కోరియోగ్రఫీ:బ్రింద,ముప్పిరి శ్రవణ్,  స్టంట్స్: జీవన్ బొటిమల, పాటలు: వనమాలీ, ఆర్ట్: కోసనం విట్టల్, డైలాగ్స్: ఉదయ్ పొట్టిపాడు చేశారు.  

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ ఈ సినిమా నిర్మించారు. సతీలీవతి రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.