రావు బహదూర్ సత్యదేవ్ వస్తున్నారహో!

టాలీవుడ్‌లో సత్యదేవ్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. కింగ్‌డమ్‌ వంటి సినిమాలో విలన్‌గాను నటిస్తున్నారు. ఏ సినిమా, ఏ పాత్ర చేసినా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ‘రావు బహదూర్’ అనే సినిమాతో ప్రేక్షకులా ముందుకు రాబోతున్నారు. 

‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా  నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మహాయాన బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి ‘రావు బహదూర్’ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో సత్యదేవ్ వృద్ధుడైన ‘రావు బహదూర్’గా నటిస్తున్నారు. ఈరోజు ఈ సినిమాలో రావు బహదూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు.

 రావు బహదూర్ వేషంలో సత్యదేవ్‌ని గుర్తుపట్టడం కూడా కష్టమే. ఈ సినిమాఫస్ట్ లుక్ పోస్టర్‌లో చుట్టూ నెమలి పించం, పువ్వులు, తేనెటీగలు, పైకి ఎగబాకుతున్న అబ్బాయిలను చూపించడం ఆసక్తికరంగా ఉంది. పైగా దర్శకుడు 'అనుమానం పెనుభూతం' అంటూ చూచాయగా కధ చెప్పినట్లే ఉంది. 

విలాస పురుషుడైన ‘రావు బహదూర్’కి సంతానం విషయంలో కలిగిన అనుమానం లేదా సమస్య ఈ సినిమా కధ అనిపిస్తుంది. ఈ ఊహ అవునో కాదో తెలియాలంటే ఆగస్ట్ 18న టీజర్‌ విడుదలయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే. వచ్చే ఏడాది  వేసవిలో ఈ సినిమా విడుదల చేస్తామని ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే చెప్పేశారు. 

ఈ సినిమాకు సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్ చేస్తున్నారు.